ప్రభుత్వ జూనియర్ కళాశాలకునిధులు కేటాయించండి జెడ్పీ చైర్మన్

Published: Tuesday February 14, 2023
మధిర ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించండి.రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు ని కలసి కోరిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఇటీవలే కళాశాల కు వెళ్లి అక్కడ సమస్యలను సిబ్బంది, విద్యార్థులను అడిగి తెలుసుకున్న లింగాల కమల్ రాజు పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభివృద్ధి మరియు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ని  జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు కోరారు. సోమవారం నాడు హైదరాబాద్ లోని బి ఆర్ కె భవన్ లో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన  జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కలిసి ప్రభుత కళాశాల విధుల కొరకు వినతి పత్రం అందజేశారు అందుకు మంత్రి తన్నీరు హరీష్ రావు సానుకూలంగా స్పందించారు కాగా ఇటీవలే మధిర పర్యటనలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లిన లింగాల కమల్ రాజు అక్కడ ప్రిన్సిపాల్ తో పాటుగా సిబ్బంది మరియు విద్యార్థులతో మాట్లాడి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే విషయాన్ని స్వయంగా హైదరాబాద్ వెళ్లి కళాశాల ప్రాముఖ్యతను రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని కోరారు మధిర ప్రజలు బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ కళాశాల గురించి మాట్లాడటం వల్ల  మధిర ప్రజలకు గురించి అతిత్వరలోనే పరిష్కార అవుతుందని . బిఆర్ఎస్ నాయకులు వారికి జడ్పీచైర్మన్ కృతజ్ఞతలుు తెలిపారు