ఎల్లకొండలో ఘనంగా ఊరడమ్మ జాతర

Published: Tuesday December 20, 2022
నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ యాదవ్
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : గ్రామ ప్రజలు పాడి పంటలతో సిరిసంపదలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లేందుకు గ్రామదేవత రక్షణ కవచంగా నిలుస్తుందని నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ అన్నారు. సోమవారం నవాబుపేట మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్నది. ఊరడమ్మ జాతర ఉత్సవాలను తిలకించేందుకు మన ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా తరలివచ్చిన వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరడమ్మ జాతరను అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందన్నదని చెప్పారు. ఊరడమ్మ జాతరకు ముఖ్య అతిథులుగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టిపిసిసి జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, వేణు గౌడ్, చేవెళ్ల నియోజకవర్గం పీసీసీ మెంబర్ రాచమల్లు సిద్దేశ్వర్, షాబాద్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు గ్రామ దేవత ఊరడమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లకొండ గ్రామంలో గత 30 సంవత్సరాల క్రితం చేసిన ఊరడమ్మ జాతరను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత నాలుగు రోజుల నుంచి ఊరడమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించామని దాంట్లో భాగంగానే బోనాల ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. దేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పంటలు బాగా పండి సిరిసంపదలు కురవాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.