స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

Published: Thursday January 20, 2022
మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో jilugumaadu గ్రామంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించి ముఖ్య నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా మధిర మున్సిపాలిటీ ఒకటో వార్డు జిలుగుమాడు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన వార్డ్ కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ కాశిరావు. మధిర పట్టణ టిడిపి పార్టీ సీనియర్  నాయకులు పగిడిపల్లి కాశీరావు ఈ సందర్భంగామాట్లాడుతూ అన్న ఆశయాలతో చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు నడుస్తూ టిడిపి పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. టిడిపి పార్టీ ఆధ్వర్యంలో 1వ వార్డ్ లో పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గులు పోటీలు నిర్వహించాము. దాదాపు 120 మంది మహిళలు ముగ్గులు పోటీలో పాల్గొన్నారు మధిర మున్సిపాలిటీ పరిధిలోని అతి పెద్ద ముగ్గులు పోటీగా నిలిచింది ఎంతో చక్కగా రంగు రంగుల ముగ్గులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన మహిళ సోదరీమణులు. న్యాయనిర్ణేతల సూచించిన ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందించడం జరిగింది. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళల సోదరీమణులందరికి కన్సల్టెంట్ బహుమతులు ఇవ్వడం జరిగింది అని మధిర మున్సిపాలిటీ చరిత్రలోనే అతిపెద్ద సంక్రాంతి ముగ్గులు పోటీగా నిలిచిందని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల నిర్వహణను కమిటీ సభ్యులు సమిష్టి కృషితో వారి సహాయ సహకారాల నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు దోర్నాల వెంకటరవి కాంగ్రెస్ పార్టీ మధిర నియోజకవర్గ ఉపాధ్యక్షులు, దోర్నాల జాన్ బాబు సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్, బలవంతపు లక్ష్మణరావు, బలవంతపు మురళి, కొత్తపల్లి శీను కొత్తపల్లి మార్కు, పేసరపల్లి స్వామి, వేల్పుల కొండ తదితరులు పాల్గొన్నారు తెలిపారు