శ్రీనిధి కళాశాల నందు వ్యాక్సిన్

Published: Wednesday March 23, 2022
మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్ నందు మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్  ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ B.అంజన బాబు మరియు ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరావు డైరెక్టర్ సిహెచ్ చందు మరియు ఇతర వైద్య సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు