పరిసరాలు పరిశుభ్రత ఎక్కడున్నాయి

Published: Saturday May 15, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలో బాలపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ నియమ నిబంధనలలో 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్, కానీ మీర్ పేట్ కార్పొరేషన్ లోని బాలాపూర్ చౌరస్తా నుండి మందమల్లమ్మ చౌరస్తా వరకు వెళ్లి దారిలో మెయిన్ రోడ్డు మీదికి పందులుసంచరించడం అక్కడున్న స్థానిక కార్పొరేటర్ గాని మున్సిపల్ అధికారులు గాని పట్టించుకునే వారు కరువయ్యారుని ప్రజలందరూ వాపోతున్నారు. పారిశుధ్య కార్మికులు చెత్తను శుభ్రపరిచే కొండ వదిలేయడం వల్ల కుక్కలు పందులు సంచరిస్తూ ఉన్నాయి, అదేవిధంగా మెయిన్ రోడ్డు పక్కనే సంద చెరువు సుందరీకరణగా ఈ మధ్యకాలంలో తీర్చిదిద్దిన మంత్రి. లాక్ డౌన్ పెట్టకముందు ఉదయం, సాయంకాలం వాకింగ్ వెళ్లే వారు ఈ దుర్వాసనకు చాలా ఇబ్బంది పడుతున్నారునీ చెప్పారు. మున్సిపల్ అధికారులు స్థానిక కార్పొరేటర్ ఆ పరిసరాలను పరిశుభ్రంగా చేయాలని వాహనదారులు, కాలనీవాసులు కరోనా మహమ్మారి వైరస్ తీవ్రత ఈ పరిస్థితుల్లో కూడా ఇలా ఉండడం ఎంతవరకు సమంజసమని కోరారు.