వాహన శోధకులు వేగ నియంత్రణ పాటించాలి. ...పారేస్టు రేంజ్ అధికారి రత్నాకర్.

Published: Friday September 16, 2022
జన్నారం, సెప్టెంబర్ 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ అటవీ శాఖ పరిధిలో బపర్ ఏరియా లోని రోడ్లు పై వెళ్ళెటపుడు వేగం కి.మీ 30 వ లోపు వెళ్లాలని పారేస్టు రేంజ్ అధికారి రత్నాకర్ తెలిపారు.  గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కవ్వాల్ టైగర్ జోన్ రహదారి రోడ్డు ఇరువైపులా 10 మీటర్ల లోపు విలైన్స్ కనపడేటట్లు ఎర్పాటు చేయడం జరిగిందని, అయిన రహదారి పై వాహనదారులు వేగము 30 కంటే ఎక్కువ వేగముతో వెళ్లడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనంలో ప్రయాణించే వారికి గాయాలు జరుగుతున్నయని అయన అన్నారు. అదేవిధంగా కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం మండలం తపాలపుార్ బస్ స్టాంపు సమీపంలో రహదారిపై బుధవారం ఉదయం కారు డీకొని చుక్కల దుప్పి మృతి చెందిందని తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రహదారి గుండా లక్షిటిపేట్ వైపు వేగంగా వెళ్తున్న కారుకు తపాలపుార్ బస్ స్టాంపు సమీపంలో అకస్మాత్తుగా జాతీయ రహదారి పై వచ్చిన చుక్కల దుప్పి, రోడ్డు దాటుతూ కారుకు తగిలి క్రింద పడి మృతి చేందిదని తెలిపారు. సమాచారం అందుకున్న ఆటవీ అధికారులు ఘాటన స్థలానికి చేసుకుని దుప్పి మృతదేహాన్ని పోస్టుమార్జంకు తరలించి, డీకొన్న కారును తాళ్లపేట్ రేంజ్ తరలించడం జరిగిందని ఎఫ్అర్ఓ రత్నాకర్ తెలిపారు.
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward