నా ఓటు నా ఆయుధం పాటను విడుదల చేసిన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ... హైదరాబాద్ (ప్రజాపాలన ప్ర

Published: Friday January 20, 2023
తెలంగాణా డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు  జి.వి.రావు నేపథ్య రూపకల్పనలో సుద్దాల అశోక్ తేజ రచయితగా జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని 'నా ఓటు నా ఆయుధం' అనే పాటను విడుదల చేశారు.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో  అశోక్ తేజ మాట్లాడుతూ కులం, మతం, డబ్బు ప్రభావం లేకుండా భారతదేశంలో ఓటింగ్ నాణ్యతను మెరుగుపరిచే మహోన్నత ప్రయత్నం ఈ పాట అన్నారు.మొట్టమొదటిసారిగా ఓటు వేసే యువ ఓటర్లకు తమ రాజ్యాంగ హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఓటు అనే ఆయుధం ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలో పేతం చేయడానికి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని, కులం, మతం,
డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు వినియోగించుకోవాలని తెలుపుతూ ఈ పాటను
విడుదల చేశామని తెలిపారు.
అశోక్ తేజ పాటకు సాహిత్యాన్ని అందించగా, యశోకృష్ణ  సంగీతాన్ని సమాకూర్చగా,
ప్రముఖ గాయకుడు రామ్ కీ పాడారు. ఈ కార్యక్రమం లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎస్ కె జోషి, తెలంగాణా రెడ్ క్రాస్ ఛైర్మన్ అజయ్ మిశ్రా,మాజీ డీజీ ఆఫ్ పోలీస్  వి హెచ్ దేశముఖ్ తదితరులు పాల్గొన్నారు.