చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి*వైరా ఏసిపి రెహమాన్

Published: Monday November 21, 2022
వంగవీడు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*

మధిర నవంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రజలు చట్టాలపైన సాంఘిక దురాచాలపైన నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైరా ఏసిపి రెహమాన్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ బొగ్గుల పద్మావతి అధ్యక్షతన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి రెహమాన్ మాట్లాడుతూ సామాజిక దురాచారాలు సైబర్ నేరాలు పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు రక్షణ కోసం సి టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు 100 నెంబర్ కు డయల్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మధిర సీఐ మురళి రూరల్ ఎస్సై నరేష్ టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ మరియు బోనకల్ ఎర్రుపాలెం టౌన్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.