**అంగన్వాడి ఎన్ హెచ్ టి ఎస్ ఆప్ ను రద్దు చేయాలి. -సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్

Published: Wednesday January 11, 2023

చేవెళ్ల జనవరి10, ( ప్రజా పాలన):-

అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి చేవెళ్ల ప్రాజెక్టు సిడిపిఓ శోభారాణి గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ దేశంలోని 25 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఎన్ హెచ్ టి ఎస్ అప్ లేదని కేవలం పోషణ్ ట్రాకర్ ఆప్ మాత్రమే ఉపయోగిస్తున్నారని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ టి ఎస్ యాప్ అమలు చేస్తూ అంగన్వాడి టీచర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
అంగన్వాడి కేంద్రాలలో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం ఇవ్వాలని స్థాపించారు వాటికి నాణ్యమైన సరుకులు మాత్రం సరఫరా చేయడం లేదు కానీ అనేక యాత్ర ద్వారా అంగన్వాడి టీచర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్ హెచ్ టి ఎస్ యాప్ ను తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన అంగన్వాడి టీచర్లకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఈఎస్ఐ,పిఎఫ్ ఏవీ లేవని కానీ వారితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని అన్నారు అంగన్వాడి టీచర్ల సమస్యలపై జనవరి 27న సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా ఫిబ్రవరి 13న రంగారెడ్డి జిల్లా కలెక్టర్  కార్యాలయం ముందు మార్చి మొదటి వారంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలను రాష్ట్ర కమిటీ రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల షాబాద్ శంకర్పల్లి మొయినాబాద్ మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు