బంజారా సంస్కృతి అందం కోసమే కాదు దనికోఆర్థముంది...

Published: Saturday December 18, 2021
పాలేరు డిసెంబర్ 17 ప్రజనపాలన ప్రతినిధి : బంజారా సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కూసుమంచి మండల అధ్యక్షుడు మాలోత్ వెంకన్న, కార్యదర్శి భుక్యా రఘు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మన బంజారా మహిళలు ధరించే వస్త్రాలు, మగవారు ధరించే రుమాలు(తలపాగా) అందం కోసమో, అలంకారానికి కాదు దానికో ప్రత్యేకత ఉందని, వారు అడవుల్లో, తమ పొలాల్లో పనులు చేసుకునే సమయాల్లో వారి ఆత్మ రక్షణకై ఈ వస్త్రాలు ధరిస్తారు. చేతినిండా ధరించే బలియా (గాజులు) క్రూర మృగాల నుండి ఆత్మ రక్షణకై వారి చేతులు అడ్డుపెట్టి మృగాల గండం నుండి తప్పించుకునే వారు, అలాగే వస్త్రాలపై కుట్టుకునే అద్దాల సహాయంతో వారి చుట్టుపక్కల నుండి వచ్చే అపాయాన్ని పసిగట్టగలుగుతారు. మన బంజారా వస్త్రాలంకరణలో ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందుకే మన బంజారా మహిళలు ధరించే వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మన ఆత్మ రక్షణకై ప్రత్యేకమైన కవచం లాంటి వస్త్రాలను ప్రసాదించారు. నేటి మోడ్రన్ జనరేషన్లో బంజారా డ్రెస్ ధరించడం సాధ్యం కానప్పటికీ మన పండుగలకు, ప్రత్యేక కార్యక్రమాలకు బంజారా సాంప్రదాయ వస్త్రాలను ధరించి మన ప్రత్యేక సంస్కృతి, గొప్ప సాంప్రదాయాలను పదిలంగా ఉంచుకుని మన ఐక్యతను చాటుదామని తెలిపారు