సిపిఐ మహాసభలు విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్

Published: Monday July 18, 2022
 జన్నారం, జూలై 17, ప్రజాపాలన:   ఈనెల మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇరువైమూడు వ తేదినా బహిరంగ సభ ప్రదర్శను ఇరువైనాలుగు వ తేదినా ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ నిర్వహించనున్న ఈ సిపిఐ సభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  హాజరవుతారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్ జన్నారం కేంద్ర పిఆర్టీ భవనంలో అదివారం అన్నారు, ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రజలందరి బాగోగులు చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పిన కేసీఆర్ ఈరోజు మాట మార్చి ఆదివాసీల మీద కేసులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తిపరచారు, ఈ ద్వంద నీతి విడనాడాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మన్నారు,  అదేవిధంగా 2001 2003 2004లో కోయపోచగూడెంలో ఆదివాసి గిరిజనుల మీద కేసులు పెట్టారంటే ఆనాడు వారు మాట మీద ఉన్న విషయం స్పష్టం అవుతా ఉన్నది దాని రికార్డ్ చేయడంలో రెవెన్యూ ఫారెస్ట్ విఫలమై నేటికి ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు, కెసిఆర్ ప్రకటించిన విధంగా 2005 గిరిజనులు పేరు మీద ఉన్న వాళ్ళందరికీ పట్టాలిస్తామన్న దాని ప్రకారం కోయపోచగూడెం ఆదివాసి గిరిజనులకు కూడా పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తామని సూచించారు,
ఈ కార్యక్రమంలో మేకల దాసు, కలిందర్ అలీ ఖాన్, పెరక రాజేశం, మెదరి దేవవరం, రమణ రెడ్డి, సరస్వతి, కృప, తదితరులు పాల్గోన్నారు.
 
 
 
Attachments area