ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి *రక్షిత కవులు దారుల భూముల్లో గోశాల పేరుతో

Published: Wednesday December 07, 2022


ఈరోజు కుర్మిద్ద గ్రామ రక్షిత కవులు దారులతో  మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  పి అంజయ్య  మాట్లాడుతూ సింగారం  తాటిపర్తి కుర్మిద్ద నంది వనపర్తి గ్రామాల రక్షిత కౌలు  దారులు 1400 ఎకరాల భూమి 500 మంది రైతులు స్వాతంత్రం రాకముందు నుండి  సాగు చేస్తున్నారు రైతులకు అన్ని రకాల హక్కులు ఉన్నప్పటికీ  రైతులకు చదువు రాదని  చూసి  దొంగ పత్రాలు సృష్టించి  దేవుని పేరు రాసి  ఓంకారేశ్వర దేవాలయం పేరుతో  రైతులకు పట్టాలు చేయకుండా మోసం చేసినారు .ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో   రైతులకు పట్టాలు చేయాలని గత కొంతకాలంగా  పోరాటం జరుగుతున్న సందర్భంగా  మరోసారి  కుట్రపూరితంగా  ఎండోమెంటు అధికారులు  పూజారులు  కొంతమంది బ్రోకర్ల సహకారంతో  గోశాల ఏర్పాటు చేయాలని   ఆలోచనతో  మరోసారి రైతులను మోసం చేసే ప్రయత్నం  చేస్తున్నారు*  ఈ ప్రయత్నాలు విరమించుకుని   రైతులకు పట్టాలు చేయాలి.1950 సంవత్సరంలో  రక్షిత కౌదారు చట్ట ప్రకారంగా  37 ఏ సర్టిఫికెట్ ఇచ్చి నారు మరి కొంత మందిని రక్షిత కౌలుదా రులుగా నమోదు చేసినారు . అన్ని హక్కులున్న   రైతులకు  పట్టాలు చేయకుండా భూ యజమానులు  దొంగ పత్రాలు సృష్టించి   ఓంకారేశ్వర్ దేవాలయం పేరు రాసి రైతులకు భూములను దక్కకుండా  చేసి శిస్తులు వసూలు చేసి పెద్ద ఎత్తున రైతులను మోసం చేసినారు. రక్షిత కౌలుదార్ చట్ట ప్రకారంగా   రైతులకు పట్టాలు చేయాలని   ఎమ్మార్వో  కలెక్టర్  మంత్రి కి మెమో రండాలు ఇవ్వడం జరిగింది. MRO కలెక్టర్ ఆఫీసుల  ముందు ధర్నాలు చేసి  నిరాహార దీక్షలు  పాదయాత్రలు పెద్ద ఎత్తున  నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ విషయాలు మీకు తెలుసు. ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు పూజారులు కొంతమంది బ్రోకర్లు కలిసి ఎలాగైనా రైతులకు భూములు దక్కనివ్వవద్దనే  ఉద్దేశంతో   రైతులంటే గౌరవం లేని వారు   గోశాల పేరుతో  కొత్త నాటకం మొదలుపెట్టారు   ఇలాంటి నాటకాలు విరమించు కోవాలి .  ఈ విషయంపై  ప్రభుత్వం అధికారులు స్పందించి  గోశాలను  ఏర్పాటును రద్దు చేసి  రక్షిత కౌలు దారులకు  చట్ట ప్రకారంగా  వారికీ పట్టాలు చేయాలి లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి  పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం, కార్యక్రమంలో  ఉపసర్పంచ్ దండే నరసింహ. భూ సాధన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు  మహేష్  సురేష్   శేఖర్  మల్లేష్  చెన్నయ్య   శేఖర్  యాదయ్య  జంగయ్య  నర్సింహ   రమేష్ బాలయ్య   మల్లేష్ తదితరులు ఉన్నారు,