స్వార్ద రాజకీయాలతో మత విద్వేశాలు రెచ్చగొట్టొద్దు.. బండి సంజయ్ పై ఏఐఎఫ్ బీ పట్టణశాఖ ఆద్వర్యంల

Published: Friday May 27, 2022
కరీంనగర్, మే 26 ప్రజాపాలన ప్రతినిధి :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముస్లిం సామాజిక వర్గంపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖండించింది. ఈ మేరకు ఏఐఎఫ్ బీ కరీంనగర్ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి వసీమొద్దీన్ ఆద్వర్యంలో బండి సంజయ్ పై ఏసీబీ తుల శ్రీనివాస్ రావు, వన్ టౌన్ సీఐలకు  గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సంధర్బంగా వసీమొద్దీన్ మాట్లాడుతూ హిందూ ఏక్తా యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాఖ్యలు ఒక వర్గాన్ని తీవ్రంగా బాధపెట్టాయన్నారు. స్వార్ద రాజకీయాలతో రెచ్చగొట్టి కులమతాల మద్య చిచ్చుపెట్టొద్దన్నారు . మసీదులో శవాలు తేలితే మీరు తీసుకోండి.. శివలింగాలైతే మాకప్పగించండి అంటూ రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. బండి సంజయ్ కేవలం స్వార్ద రాజకీయాలతో మత విద్వేశాలు రెచ్చ గొడుతున్నారని మండి పడ్డారు. రాజ్యాంగపరంగా ఎంపీ హోదాలో ఉండి యాత్రలు చేస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ మంచి వాతావారణాన్ని చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉంటున్నారని , ఇప్పుడూ బాయి బాయీ అనే వాతావరణాన్ని చెడగొట్టడంలో ఆయనకు స్వలాభం ఉందన్నారు. మతం అంటే కలిపేది కానీ విడదీసేది కాదన్నారు. భారత దేశం మత సామరస్యాల సందేశమని తెలిపారు. మదర్సాలలో తీవ్రవాదం నేర్పిస్తున్నారని, మదర్సాను , మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఉర్దూ బాషను నిషేదిస్తామంటూ ఆయన చేసిన వాఖ్యలు ఎవరూ సమర్దించడం లేదన్నారు. వేములవాడలోని శివాలయంలో ఉన్న దర్గాలో శివభక్తులను ఆశీర్వదించే అపూర్వ ద`శ్యం కనిపిస్తుందన్నారు. చార్మినార్ లో ఒక మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారికి దేవాలయముందని, బక్రీద్ను వీక్షించిని అదే చార్మినార్ లక్ష్మి దేవికి పూజలు చేసి దీపావళి కాంతుల్లో వెలిగిపోతుందన్నారు. దేశంలో ఇలా ఎన్నో ఉదాహరణలున్నా మత పిచ్చితో విద్వేశాలు రెచ్చగొట్టడం దేనికోసమని ప్రశ్నించారు? సవాల్ విసిరిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన మసీదులు కావని పేర్కొన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ముస్లిం సామాజిక వర్గంపై అనుచిత వాఖ్యలు చేశారన్నారు. అతనిపై 295, 153 సెక్షన్ల ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సుమోటో కేసుగా పరిగణించి చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎంతో మంది రాజకీయ ప్రజాప్రతినిధులకు జరిగినా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం తగదన్నారు. వెంటనే బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి సలీం షేక్, టీయూసీసీ జిల్లా కన్వీనర్ కె.శంకర్, నాయబ్ ఖాన్. ఎంఏ కరీం, ఎండీ ఫయాజ్ తదితరులున్నారు.