జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు

Published: Tuesday August 02, 2022
జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 01 ఆగస్టు ప్రజా పాలన : ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దినదినాభి వృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వారి స్వగృహంలో కలిసి కేక్ కట్ చేసి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ శుభాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపిని గడపగడపకు చేర్చాలని ఆకాంక్షించారు. కార్యకర్తలను సమన్వయపరుస్తూ ప్రతి ఇంట బజెపి జెండా ఎగిరేసే విధంగా
కృషి చేయాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగే విధంగా అందరమూ కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్, బీజేపీ మోమిన్ పెట్ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు విజయ్ రాజ్, బీజేపీ నాయకులు శివరాజ్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area