ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

Published: Wednesday November 16, 2022
 ట్రాఫిక్ సిఐ మక్బూల్ జానీ
మేడిపల్లి, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి)
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉప్పల్లో
ఏఐటీయుసీ నేత, క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ కో చైర్మన్ టి.రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన 
యంగ్ మెన్  సెవెన్ సీటర్ అసోసియేషన్, ఏఐటీయుసీకి అనుబంధ సంస్థగా చేరుతున్న సందర్భంగా ఉప్పల్లో
 ఏఐటీయుసీ జెండా ఆవిష్కరణ, ఆటో కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మక్బూల్ జానీ, ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ పాటించాలని, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. డ్రైవర్లు విధిగా తమ గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని, ఆపద సమయంలో అవి ఉపయోగపడతాయని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేయాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రత వరోత్సవాలలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు ఆటో డ్రైవర్లు సహకరించాలని, పోలీసులు విధి నిర్వహణలో మనకు చేయూత అందిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
సుమారు 70 మంది ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంగ్ మ్యాన్ 7 సీటర్  అనుబంధ సంస్థ  ఏఐటియుసి  యూనియన్ నాయకులు 
బి, వెంకటేశం, ఎం, కొండల్ రెడ్డి
తిరుమలేష్ గౌడ్, ఉప్పల్ యాంగ్ మెన్ సెవెన్ సీటర్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, గౌరవ అద్యషుడు రమేష్, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.