సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల కాంగ్రెస్ సంతాపం*

Published: Wednesday November 16, 2022

మధిర  నవంబర్ 15 (ప్రజా పాలన ప్రతినిధి) నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఒక సాహసవంతమైన ప్రయాణం చేసిన సూపర్ స్టార్ కృష్ణ మృతికి మధిర మండల కాంగ్రెస్ కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కృష్ణ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సూచనల మేరకు 1984లో కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ హత్యకు గురవడం ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉన్నారని వారు గుర్తు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు వారికి మరియు చిత్ర పరిశ్రమకు  తీరని లోటన్నారు.సంతాపం తెలిపిన వారిలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ సైదల్లిపురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, నిడమనూరు వంశీ సూర్యదేవర కోటేశ్వరరావు వుట్ల రాంబాబు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ కర్లపూడి వాసు ఎడ్లపల్లి శ్రీనివాసరావు ఉషా భాస్కరరావు తదితరులు ఉన్నారు.