విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు..

Published: Tuesday September 27, 2022
తల్లాడ, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రెండో రోజు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ నృత్యాలు చేశారు. తొలుత ఆలయంలో అమ్మవారికి ఏకపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.