అంబెడ్కర్ ఆశయ సాధనకు బహుజను లంతా ఏకం కావాలి.

Published: Saturday March 26, 2022
ఇండియా ప్రజా బంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తాడెం రాజ్ ప్రకాష్.
మంచిర్యాల బ్యూరో, మార్చి 25, ప్రజాపాలన: బారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ ఆశయ సాధనకు బహుజను లంతా ఏకం కావాలని ఇండియా ప్రజా బంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  తాడెం రాజ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం నస్పూర్ లోని ఇండియా ప్రజా బంధు పార్టీ మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనకం శైలజ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, బహుజనుల హక్కులు హరిస్తున్నాయని విమర్శించారు. అంబెడ్కర్ రాజ్యంగాన్ని మార్చి మనువాదా విష సంస్కృతి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల హక్కులు లేకుండా చేయడొనికి కొత్త రాజ్యంగాన్ని రాస్తా అని అంటు న్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాచే భూర్జవ పార్టీల మెడలు వంచి అధికారంలో మన వాటా కోసం బహుజనులంతా అంబెడ్కర్ వారసులు గా ఉద్యమించాలని అన్నారు. ఓట్ల కోసమే దళిత బందు తెచ్చిన కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు పది లక్షలు నగదు అందజేసు కునే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. 
పలువురి కి పార్టీ బాధ్యత లు అప్పగింత.
ఇండియా ప్రజా బంధు పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ కి సంబంధించిన కీలక పదవులకు పలువురు నారకులను నియమించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షునిగా గడ్డం సత్య గౌడ్ ని, మంచిర్యాల జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షునిగా  మహమ్మద్ జానీ ని ,  జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షునిగా మొహమ్మద్ హాజీ ని, మంచిర్యాల మండలం అధ్యక్షునిగా బోల్ల మధుకర్ లతో పాటు పార్టీ క్రియాశీల సభ్యులుగా మచ్చ మహేందర్, షేక్ కలీం లను నిరమించారు. వీరికి నిరమాక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.