జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం...

Published: Monday October 04, 2021
జగిత్యాల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అధ్యక్షతనలో నిర్వహించిన సమావేశంలో ముందుగా అగ్రికల్చర్ ఆర్టీకల్చర్ అంశాలపై విస్తృతమైన చర్చ కోనసాగింది. స్థానిక ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ అగ్రికల్చర్ శాఖపై మాట్లాడుతూ ఏవో ఏఈవో పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉన్న కూడ రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడంలో కోంత ఆశ్రద్ద కనబడుతుందని రైతుబంధు సమన్వయ సబ్యులకు సమాచారం ఇవ్వడంలో విఫలం అవుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సారంగాపూర్ మండల్ కొనపూర్ సహకార సంఘంలో కొంత మంది రైతులకు ఖాతాలో రుణమాఫీ జమ కాకపోవడంతో ఎమ్మెల్యే సంజయ్ అధికారులపై విరుచుకుపడ్డారు. కోతుల బెడదతో అడవి ప్రాంతంలో పండ్ల చెట్లు తునికి అల్లనేరడి తదితర చెట్లు నాటాలని కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రావుకు సూచించారు. విద్య వైద్యం పంచాయతీ రాజ్ మత్యుశాఖ తదితర అంశాలపై విస్తృతమైన చర్చ జరిగింది. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు టీటీడీ డైరెక్టర్ కావడంతో జడ్పీ ముగింపు తర్వాత జడ్పీ చైర్ పర్సన్ వసంత ఎమ్మెల్యే సంజయ్ జడ్పీటీసీ ఎంపీపీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి జడ్పీ సీఈవో సంధ్యారాణి డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి వివిధ మండలాల జడ్పీటిసిలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.