ఇందారం గని సమస్యలు పరిష్కరించాలి

Published: Friday November 04, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం ఐకే 1 ఏ గని పై ప్రతిరోజు మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యే కార్మికులకు సమస్యలు తప్పడం లేదని. ఒకవైపు గని మరోవైపు ఓపెన్ కాస్ట్ ఉండడంతో ఇన్ మాస్టర్, ఔట్ మాస్టర్ వేసే సమయాల్లో ఆలస్యంమే కాకుండా ఒకే కంప్యూటర్ తో పని చేయడంతో ఇన్ మాస్టర్ వెస్తుండటంతో రూం వద్ద నుండి మెయిన్ గేట్ వరకు క్యూ లైన్ లో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని. లైన్ లో నిలబడడం తో కాళ్ల నొప్పులు వస్తున్నాయి అంటూ కార్మికులు వాపోతున్నారు.ఉదయం   ఇన్ మాస్టర్ వేయడంలో ఆలస్యం చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  డ్యూటీ ముగించుకొని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కి రావాలంటే మ్యాన్ రైడింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. వెంటనే  అధికారులు స్పందించి గని   సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.