అంగన్వాడి కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ పుల్లమ్మ..

Published: Tuesday March 02, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి ) మార్చి1 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని కోనాయిగూడెం అంగన్వాడి కేంద్రం లో మొదటి. యన్.హెచ్. డి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ హాజరై బాలామృతం ప్యాకెట్స్ పంపిణీ చేశారు అనంతరం సర్పంచ్ పెంట మల్ల. పుల్లమ్మ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరబాబు, అంగన్వాడి టీచర్ వడ్లముడి నాగమణి, ఆశ బేబీ, ఆయా సావిత్రి, పిల్లల తల్లులు తిరుపతమ్మ, బి.జ్యోతి, బి.వాణి, బి.స్వప్న తదితరులు పాల్గొన్నారు.