ఇబ్రహీంపట్నం లో ఆర్టిసీ పోలీసుల స్పెషల్ డ్రైవ్

Published: Wednesday November 24, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : సరైన పత్రాలు లేని వాహనాలతోపాటు, రోడ్డుపైకి డ్రైవింగ్ నియమనిబంధనలతో సంబంధంలేకుండా నడిపే వాహనాల విషయంలో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు మరియు ఆర్టీవో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ఇబ్రహీంపట్నం, శేరిగూడ లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రజల అభ్యర్ధనలను పరిగణలో తీసుకొని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు, ఆర్టీవో విభాగం తమ సిబ్బందితో 5 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ చౌరస్తా శేరిగూడ చౌరస్తాలలో రద్దీగా వున్న పలు సెంటర్లలలో సుమారు 40 వాహనాలను తనిఖీ నిర్వహించి 7  వాహనాలకు సరైన పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ బాబు నాయక్ ఆధ్వర్యములో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, ప్రయాణానికి అనుమతులు లేని వాహనాలు, ఓవర్ లోడింగ్, లైసెన్స్ లేకుండా అజాగ్రత్తగా నడిపే వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్ విఐ లు బలరాం, మల్లికార్జున్ రెడ్డి, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ భావ్ రావు, సెక్యూరిటీ ఆఫీసర్ పురుషోత్తం, ఆర్టీసీ మరియు ఆర్టీవో పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు.