అమ్మ చెస్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్

Published: Tuesday October 19, 2021

జగిత్యాల, అక్టోబర్, 18 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో అమ్మ చెస్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసినారు. ఈ కార్యక్రమంలో డి సి ఎం సి చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు దావ సురేష్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ నరహరి, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, తదితరులు పాల్గొన్నారు.