అంగన్వాడీల ఉద్యోగ భద్రతకై పోరాడుదాం

Published: Thursday November 03, 2022
 అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీతా మహాలక్ష్మి.
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 బూర్గంపహాడ్ : అంగన్వాడీ సిబ్బంది ఉద్యోగ భద్రతకై పోరాడాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ch సీతామహాలక్ష్మి కోరారు సారపాక నకిరాపేట లో జరిగిన యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ గత 46 సంవత్సరాలుగా మాతా శిశు సంరక్షణలో అనేక సేవలందిస్తు అరకుర వేతనాలతో జీవనం సాగిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోరుబాట పట్టాలని ఆమె కోరారు. ఈనెల 12న కొత్తగూడెంలో జరిగే అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా రెండో మహాసభలను జయప్రదంచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరాటి ప్రసాద్ కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ యూనియన్ నాయకులు అరుణ శ్రీ శ్రీదేవి రమణ మాలతి భవాని బాలమ్మ రాజేశ్వరి రజిని మంజుల జ్యోతి రచన తార మంగ నాగవేణి తదితరులు పాల్గొన్నారు