ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వక్ఫ్ బోర్డ్ బాధితులకు ఇబ్బందులు

Published: Thursday March 09, 2023
ప్రొఫెసర్ కోదండరాం
మేడిపల్లి, మార్చి 8 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో 
బోడుప్పల్ వక్ఫ్ బోర్డ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారని
ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 
 బోడుప్పల్ వక్ఫ్ బోర్డు బాదితుల జేఏసీ అధ్వర్యంలో  మున్సిపల్ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11 వ రోజుకు చెరుకున్నాయి.ఈ రిలే నిరాహారదీక్షలకు ప్రొఫెసర్ కోదండరాం  సంఘీభావం తెలుపగా వారితో  పాటు   టీజేఎస్ రాష్త్ర నాయకులు లక్ష్మారెడ్డి, సిటీ ప్రెసిడెంట్ నర్సయ్య , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె. మాధవి, స్థానిక కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, పోగుల నర్సింహ రెడ్డి మరియు కొత్త కిషోర్ గౌడ్,  గోనె శ్రీనివాస్ , కూరపాటి విజయ్ కుమార్, సత్యశీల రెడ్డి , ప్రహ్లాద రెడ్డి, రవీంద్ర బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని, మీరు భయపడాల్సిన అవసరం లేదని, మీతో పాటు మేము కలిసి ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ దీక్షలో 17 వ డివిజన్ మహిళలు మీనాక్షి, స్వరూప,విజయ,వినోద, శ్యామల,శ్రీవాణి, బృధవని, సులోచన,నర్మద,సరిత కూర్చున్నారు. వారికి జేఏసీ నాయకులు సురేష్,రాజు, శోభ , నీరజ, భావన, అంజయ్య యాదవ్, ధనంజయ రావు, విశాల్, మురళి, మహేష్ మరియు నర్సింహులు, శ్రీకాంత్ , పెద్ద సంఖ్యలో మహిళలు సంఘీభావం తెలిపారు.