ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

Published: Thursday April 22, 2021

మధిర,  ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవారం మధిర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, రైతుల వద్ద నుండి నేరుగా కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు, రైతు వేదికలు ఏర్పాటు లాంటి అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతుని రాజుని చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరావు వై.వి. అప్పారావు, కరివేద సుధాకర్ పాల్గొన్నారు.