కరోనా రోగులకు అనుభవజ్ఞులైన డాక్టర్లతో ఉచిత వైద్య సేవలు, మందులు

Published: Friday May 28, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : మానవసేవే మాధవసేవ అని భావిస్తూ మాజీ శాసనసభ్యులు మారబోయిన బిక్షపతి యాదవ్ ఏర్పాటు చేసిన సంధయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవలు నేడు కరోనా రోగుల పాలిట వరంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య గతంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందున్న సంధయ్య మెమోరియల్ ట్రస్ట్ యజమాన్యం ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలో పలు ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేద ప్రజల కోసం స్వయంగా తన సొంత నిధులతో అనుభవజ్ఞులైన డాక్టర్లను నియమించి కరోనా బారిన పడ్డ రోగులకు  ఉచిత అంబులెన్సు, ఉచిత మందులును అందజేయడానికి 7901629623 నెంబరు పై కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం జరిగిందని మీరంతా మా యొక్క సేవలను పొందుతారని కోరుతూ మీకు ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో మనకు తెలిసిన ఎంతో మంది కరోనా బారినపడి చనిపోవడం జరిగిందని, ఇప్పుడు కూడా ఎంతోమంది డబ్బులు లేక వైద్యానికి దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ఈ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆపదలో ఉన్నవారు ఈ కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే వాలంటీర్స్ వచ్చి మీకు తగు సహాయం చేయడమే కాకుండా అవసరమైనవారికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం, ఉచిత మందులు, డాక్టర్స్ పర్యవేక్షణ, సూచనలు కూడా ఉచితంగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నాగేష్, బాల కుమార్, శ్రీనివాస్ యాదవ్ మొదలగువారు పాల్గొన్నారు.