ప్రజల భాగస్వామ్యం తోనే పల్లె ప్రగతి పురోగతి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Wednesday July 14, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 13, ప్రజాపాలన : గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి లో భాగంగా 4 విడత కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధుల సమన్యాయంతో ప్రజల భాగస్వామ్యంతో పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ఆసిఫాబాద్, సిర్పూర్ యు, లింగాపూర్, జైనూర్, కెరమెరి, వాంకిడి, తిర్యాని, మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం లో మిగిలి ఉన్న పనులను ఈనెల 23వ తేదీలోపు పూర్తిచేయాలని, పంచాయతీలలో జరిగే ప్రతి పని ప్రజల భాగస్వామ్యంతో వారికి తెలిపి  జరిగే విధంగా అధికారులు చొరవ చూపాలని, గ్రామ పంచాయతీలలో సీజనల్ వ్యాధులు వస్తే ఎటువంటి నోటీసులు లేకుండా పంచాయతీ కార్యదర్శులు తొలగించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీలలో ఖర్చుల వివరాలు విడివిడిగా లేవని ప్రతి ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని, పల్లె ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలు ఉండకుండా చూడాలని, తప్పనిసరిగా స్థాయి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదం పొందిన తరువాత  నిధులు ఖర్చు చేయాలని అన్నారు. దోమల వృద్ధి నివారించేందుకు పంచాయతీలలో నీరు నిల్వ ఉన్నచోట ఆయిల్ బాల్స్ చేయాలని, అన్ని గ్రామ పంచాయతీల లో మార్కెట్ ప్రాంతాలలో, చెత్త లేకుండా చూడాలని, ఎస్సీ, ఎస్టీ, హ్యభిటేషన్ పై ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, రవి కృష్ణ, రత్నమాల, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మన్నెమ్మ, సంజీవన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.