మూడవ రోజు అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహం

Published: Saturday December 24, 2022

వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజా పాలన : యజ్ఞం, యాగం ఒక విశిష్టమైన హిందూసంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయి. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి మైదానంలో అతి రుద్ర మహాయజ్ఞ సప్తాహం కార్యక్రమం మూడవరోజు కొనసాగుతున్నది. అతిరుద్ర మహా యజ్ఞ సప్తహంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు చిగుళ్లపల్లి మంజుల రమేష్ వికారాబాద్ మండల పరిషత్ అధికారి దంపతులు సత్తయ్య ఆయన సతీమణి మండల పరిషత్ ఇంజనీర్ దంపతులు నవీన్ ఆయన సతీమణి యజ్ఞంలో భాగస్వాములయ్యారు.