*ఘనంగా భారత ఘణతంత్ర వేడుకలు

Published: Friday January 27, 2023

చేవెళ్ల జనవరి 26, (ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం, ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను, ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి ఎం ప్రభులింగం జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వడ్ల సత్యనారాయణ  లు మాట్లాడుతు  భారతదేశంలో  జనవరి 26,1950 సంవత్సరం రోజున.భారత  రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని,ఈరోజునే భారత గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని చదివి హక్కులను తెలుసుకోవాలని  అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం అని, ప్రతి భారతీయుడు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో జివించేందుకు,స్వేచ్ఛ అనే ఆయుధమును, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వార  కల్పించాడు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం చదివి, స్వేచ్ఛ యుతంగా జీవించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో
మండల పార్టీ కార్యదర్శి సత్తిరెడ్డి ఏఐకేఎస్ రాష్ట్ర సమితి సభ్యులు సుధాకర్ గౌడ్ మండల పార్టీ సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ మండల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ కృష్ణ చారి మండల మహిళా సమాఖ్య నాయకురాలు సాయిల్ అమ్మ అనసూయ తదితరులు పాల్గొన్నారు