అనవసరంగా రోడ్ల మీదకు వస్తే చర్యలు తప్పవు : ఏసీపీ అఖిల్ మహాజన్

Published: Thursday May 20, 2021

మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే19, ప్రజాపాలన : లాక్ డౌన్ వేళ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుందని అ మంచిర్యాల ఏ సి పి అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. బుధవారం  లాక్ డౌన్ వేళ మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందన్ పెల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను అకస్మిక తనిఖీ చేశారు. అక్కడ  కోనసాగుతున్న పోలీసు బందోబస్తు తీరు పై  క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనీఖీలు చెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వాహదారులకు జరిమానా విధించాల్సిందిగా పోలీస్ అధికారులను అదేశించారు. ఈ తనీఖీల్లో లక్షెట్టిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్, జన్నారం ఎస్సై ఆది మధుసూదన్ రావు పాల్గోన్నారు.