వాడ వాడల ఘనంగా కామ్రేడ్ దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

Published: Tuesday April 04, 2023

సోమవారం రోజున  మంచాల మండలం పరిధిలోని ఆరుట్ల గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య కురుమ గారి 96వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్  కొంగర విష్ణువర్ధన్ రెడ్డి  పాండాల జంగయ్య గౌడ్ ఎంపీటీసీ వర్యులు చీరాల రమేష్ కురుమ  , గ్రామ సచివాలయ సభ్యులు  కొండూరు మల్లేష్ కురుమ  గొర్రెల   మేకల పెంపకదారుల సొసైటీ చైర్మన్ చిందం జంగయ్య కురుమ  , వైస్ చైర్మన్ మహేందర్ యాదవ్ , భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకులు  చిందం రఘుపతి కురుమ  సిపిఎం పార్టీ మండల నాయకులు శ్రీ మార బుగ్గ రాములు కురుమ    మరియు  పెద్దలు  మారచిన బీరప్ప కురుమ  , అరిగే బుగ్గయ్య కురుమ , గ్రామ పెద్దలు ఒగ్గు భాస్కర్ , మహమ్మద్ యూసుఫ్, మాడుగుల బుచ్చయ్య గౌడ్, గ్రామ పెద్దలు మరియు కురుమ యువత పెద్ద ఎత్తున హాజరై నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు దొడ్డి కొమరయ్య గారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు.