ఖమ్మం పీఠంపై నీరజ

Published: Saturday May 08, 2021
ఖమ్మం, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్కు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది మెజారిటీ స్థానాలను దక్కించుకుని తెరాస మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది నూతన పాలక వర్గాన్ని ఎన్నిక చేసే క్రమంలో తెరాస అధిష్టానం ప్రధాన పదవులకు సంబంధించి అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్ లో పంపించారు రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి ఇ ఎన్నికల పరిశీలకులుగా ప్రభుత్వం నియమించింది దీంతో నువ్వు ఒక రోజు ముందుగానే ఖమ్మం కు చేరుకున్న వారిరువురు తెరాస కార్పొరేటర్ల తో మంతనాలు జరిపారు శుక్రవారం మూడు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు ప్రత్యేక అధికారి సమక్షంలో మేయర్ డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు తెరాస కార్పొరేటర్లు మద్దతు పలికిన సిపిఐ కార్పొరేటర్లు ఉమ్మడిగా ప్రత్యేక వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు నిర్ణీత సమయంలోనే ప్రమాణస్వీకారోత్సవానికి నిర్వహించారు ఖమ్మం కార్పొరేషన్ తొలి మహిళ నేరుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేయర్ నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా ముక్తార్ కృతజ్ఞతలు తెలిపారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నూతనంగా ఎన్నికైన మేయర్ డిప్యూటీ మేయర్ అభినందించారు 40 నిమిషాల్లో నే ఎన్నికల నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పలువురు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు నూతన పాలక వర్గం ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు మొత్తం మీద ఖమ్మం ఖిల్లా పై గులాబీ జెండా రెపరెపలాడింది