సిపిఐ అద్వర్యం లో 74వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు"

Published: Thursday September 15, 2022
ఆసిఫాబాద్ జిల్లా,  సెప్టెంబర్ 14 , ప్రజాపాలన, ప్రతినిధి : 
 
జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట74వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బద్రి సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బద్రి సత్యనారాయణ మాట్లాడుతూ "భూమికోసం, భుక్తి కోసం" వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వానికి వ్యతిరేకంగా బంధుకులు చేతపట్టి తెలంగాణ సాయుధ పోరాటం చేసిన రావి నారాయణరెడ్డి, కొమురయ్య, బద్దం ఎల్లారెడ్డి, చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ పోరాటం చేసి సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. 1947 ఆగస్టు15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబులు బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబులు బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం చేసి నిజాం నవాబులు వెళ్ళిపోవడం జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసి 10లక్షల ఎకరాల భూమిని పంచి మూడువేల గ్రామాలకు విముక్తి కల్పించిన కమ్యూనిస్టులు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లిం అని వక్రీకరిస్తూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ మాట నిలబెట్టుకోవాలని సాయుధ పోరాట పటిమను పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు ఎస్ తిరుపతి, జగ్గయ్య, జాడి గణేష్, శ్రీనివాస్, ఆత్మకూరి చిరంజీవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.