విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలి ** జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ ర

Published: Thursday February 16, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 15 (ప్రజాపాలన,ప్రతినిధి) :
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ రాణించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్టార్ కల్చరల్ -2023 కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. కార్యక్రమాలలో పాల్గొనడం వలన భయం పోయి మరింత పై స్థాయి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు క్రమశిక్షణ ఉంటుందని, రంగోలి, క్విజ్, ఉపన్యాస, గ్రూప్ డాన్స్, సోలో డాన్స్ ఇతర క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. స్టార్ కల్చరల్ కార్యక్రమంలో జిల్లాలోని 16 ఆశ్రమ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, డి.సి.డి.ఓ. శకుంతల, ఏ.టి.డి.ఓ. క్షేత్రయ్య, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.