పేదలను ఆదుకొనుటకు మానవతా మూర్తులు ముందుకు రావాలి.

Published: Tuesday May 25, 2021
పాలేరు, మే 24 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొనాయి గూడెం గ్రామంలో కరోనా లాంటి విపత్తు సమయంలో నిరుపేదలను, కోవిడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోనాయిగూడెం. సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, పిలుపునిచ్చారు. నేలకొండపల్లి కి చెందిన ప్రముఖ వ్యాపారి మాటూరి సుబ్రహ్మణ్యం - శ్రీదేవి దంపతుల పెళ్లి రోజు మరియు వారి కుమార్తె ఉదయ్ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా 25 మంది నిరుపేదలు మరియు కోవిడ్ బాధిత కుటుంబాలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సోమవారం నిత్యవసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా విపత్తు ను ఎదుర్కునేందుకు పేదలను అదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా మహామ్మారి ని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగకుండా హోం క్వారంటైన్ లో ఉండాలని అన్నారు. నిరుపేదలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన సుబ్రహ్మణ్యం దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బిందె పటేల్, వడ్లమూడి గురవయ్య, బైరు భారతమ్మ, బిందె యాకోబ్, బొడ్డు ఆంజనేయులు, కస్తాల నాగరాజు, గుర్రాల పుల్లమ్మ, కుమ్మరి లావణ్య, బిందె ఉపేంద్ర, దార వీరస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు