త్వరలో డయోగ్నోటిక్ కేంద్రం ప్రారంభం

Published: Tuesday June 08, 2021
నూతన ల్యాబ్ పరిశీలించిన ఎమ్మెల్యే
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, జూన్ 07, ప్రజాపాలన ప్రతినిధిత్వరలో ప్రారంభం చేయబోతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రెండు రోజుల్లో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు. సంబంధిత అధికారి గైర్హాజర్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్లతో మాట్లాడి గర్భిణీలకు నెల నెల ఇవ్వాల్సిన టీకాల కోసం ఆరా తీశారు. అనంతరం రాజీవ్ నగర్ కాలనీలో నూతన వంద పడకల ఆసుపత్రిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కోసం వస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. నూతన వంద పడకల ఆసుపత్రిలో ఆర్ టిపీసిఆర్ ల్యాబ్ కి సంబంధించి ఏర్పాట్లు, సామాగ్రిని తొందరగా సమకూర్చుకోవాలని అన్నారు. నూతన ఆసుపత్రిలో ఓపికి సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి. తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్ సురేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ జెడ్పీటీసీ ముత్తాహార్ షరీఫ్, డిఎం అండ్ హెచ్ఓ సుధాకర్ షిండే, డాక్టర్ ప్రదీప్, సిస్టర్  సంధ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.