వైభవంగా బీరుపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

Published: Thursday February 23, 2023

బీరుపూర్, ఫిబ్రవరి 22 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన గొడిసెల రమేష్ ప్రధాన కార్యదర్శిగా సాతర్ల మహేష్ ఉపాధ్యక్షులుగా గుమ్మడి రమేష్ చింత కృష్ణ సహాయ కార్యదర్శులుగా తోట నరేందర్ చీర్నేని శ్రీనివాస్ కోశాధికారి పురంశెట్టి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అడెపు రవిలను జిల్లా ప్రధాన కార్యదర్శి మొరపల్లి ప్రదీప్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ ఈసీ మెంబర్ శ్యామ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పుడూరి శోభన్ కార్యవర్గాన్ని ప్రమాణం చేయించారు. ఈ కారేక్రమానికి ముఖ్యతిథిగా స్థానిక ఎమ్మెల్యే డా:  సంజయ్ కుమార్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముఖ్యతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యవర్గాన్ని శాలువలతో సన్మానించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలు సకాలంలో పరిష్కరిస్తామని ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూం ఇండ్లుకు కృషి చేస్తానని పత్రికల పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మరమేష్ బలుమురి లక్ష్మణ్ రావు ముప్పాల రాంచందర్ రావు కొలుముల రమణ నారపాక రమేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాత్రికేయులు గౌరవ అధ్యక్షులు సుంకరిపెళ్లి రవీందర్ అక్కినపెళ్లి వేణుగోపాల్ హుస్సేన్ రవి రాజేష్ పూర్ణచందర్ శేఖర్ పాత్రికేయులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.