అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో జేయేన్నరం కాలనీలో మంచినీటి ఎద్దడి

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధిఅబ్దుల్లాపూర్మెట్ గ్రామంలోని జేయన్నరం కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. కొన్ని బ్లాక్ లకు, మంచినీళ్లు పైకి ఎక్కకుండా కిందనే పట్టుకుంటున్నారు. కాలనీలో 12 లక్షల లీటర్లు పట్టే ట్యాంక్ నిర్మించారు. ప్రతిరోజు ఆరు లక్షల లీటర్లు కాలనీకి రావాలి. అలా కాకుండా, ఒక రోజు ఒక లక్ష లీటర్లు, మరో రోజు లక్ష ల నుండి రెండు లక్షలు మూడు లక్షల లీటర్ల వరకే రావడం వల్ల కొన్ని బ్లాకులోకి ఐదు రోజుల నుండి 15 రోజుల వరకు నీళ్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఈ కాలనీలో 3000 కుటుంబాల వరకు ఉంటారు. ఈ కుటుంబాలకి సరిపడే మంచినీళ్లు అందజేయాలని సిపిఎం అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఈరోజు కాలనీలోని ప్రజలను కలిసి మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బిందెలతో ప్రదర్శన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుండె శివ, కాలనీవాసులు అనేకమంది మహిళలు పాల్గొని మంచినీళ్ల సమస్య తీర్చాలని ఆవేదనపడ్డారు. అక్కడున్న ఇండ్లు మొత్తం బ్లాకులు208,మొత్తం ఇండ్లు4992 ఉంటాయి అందులో మూడు వేల నుండి 3500 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. మంచి నీళ్ళు లేక చాల ఇబ్బంది ఉందన్నారు.