క్లాసులు చెప్పేవారు లేక అంబేద్కర్ స్టడీ సెంటర్ బయట సైకాలజీ విద్యార్థులు

Published: Monday November 28, 2022

హైదరాబాద్ 27 నవంబర్ ప్రజాపాలన: అందరికీ విద్య అనే నినాదంతో అంబేడ్కర్ సార్వత్రిక  యునివర్సిటీ పనిచేస్తుంది.ఎంతో మంది వివిధ కారణాల వల్ల మధ్యలో చదువు కొనసాగించలేక పోయారు.అలాంటి వారి కోసం పని చేసుకుంటూ తమ చదువులు కానీ సాగించాలనే ఆశయం తో పిజి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్నారు. 27 నవంబర్ నుండి పిజి క్లాసులు ఉంటాయని తెలిపే విధంగా యునివర్సిటీ నోటీసు బోర్డులో ఉంచారు. మరియు సంబంధిత విద్యార్థులకు నిక్షిప్త సమాచారం చరవాణీలకు అందించారు. ఈ సమాచారం ఆధారంగా జూబ్లీ హిల్స్ లోని 228 స్టడీ సెంటర్ కు వివిధ ప్రాంతాల నుండి సైకాలజీ, బి.యల్. ఎస్.ఐ.,యం. ఎల్.ఎస్.ఐ    విద్యార్థులు క్లాస్ నిమిత్తం హాజరు అయ్యారు. ఆదివారం అయినా శ్రమ కోర్చి విద్యార్థిని విద్యార్థులు తమ పిల్లలను భర్తలను వెంటేసుకుని సుదూర ప్రాంతాలనుండి యునివర్సిటీ స్టడీ సెంటర్ కు వస్తే ఈరోజు క్లాసులు లేవని తలుపులు మూసి ఉంచారు.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ రోజు క్లాసులు లేవని సెక్యూరిటీ సిబ్బంది తెలియజేయడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్టడీ సెంటర్ ఇంచార్జి కూడా అందుబాటులో లేకపోవడం తో విద్యార్థులు అందరు ఇళ్ల కు వెనుతిరిగి వెల్లారు. స్టడీ సెంటర్ చేసిన
అసౌకర్యానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
 
 ఇప్పటికైనా విద్యార్థుల కు ముందస్తు సమాచారం అందజేయాలని ఇలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.