మద్దుల చెరువు శిఖం భూములను కాపాడాలి : అఖిలపక్ష పార్టీల డిమాండ్

Published: Wednesday November 24, 2021

కోరుట్ల, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువును ఆనుకొని ఉన్న శిఖం భూములను అక్రమ కబ్జాల నుండి కాపాడాలని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు అనుకొని ఉన్నా భూములపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని ప్లాట్లుగా విభజించి అమ్ము కొనుటకు భూములను చదును చేస్తున్న సందర్భంగా మంగళవారం రోజున మద్దుల చెరువు మినీ ట్యాంక్ వద్దకు వెళ్లి అఖిలపక్ష పార్టీల తో పరిశీలన జరిపారు ఈ భూములను అమ్ముకోవడానికి చెరువు నీటిని ఆపకుండా ఎఫ్ టి ఎల్ ఫుల్ టాంక్ లెవెల్ హద్దులు పాదాలని హెచ్చరిక బోర్డులు వేయాలని కోరారు అలాగే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం నడుస్తున్న సందర్భంగా ఎత్తు కూడా పెంచితే నీటి ప్రవాహం ఉండి అందులో లో బోటు ఇతర సౌకర్యాలు ఏర్పరచుకోవచ్చు పేర్కొన్నారు ఈ భూములు కబ్జాల గురవుతున్న భూములు కాపాడాలని అధికార పార్టీ కౌన్సిలర్ బాహాటంగా ఆ స్థలంలో వెళ్లి పరిశీలించి అధికారులకు చూపించి నిలిపివేయాలని మీడియా ద్వారా పత్రికల ద్వారా విమర్శ చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు గౌరవ సభ్యులు ఇంతవరకు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు మండల రెవెన్యూ అధికారి ఇ ఆఫీస్ కు భూత పెట్టు లో ఈ వ్యవహారం పంచాంగం నడుస్తున్న పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి 2016లో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇచ్చట శంకుస్థాపన వేసి ఇ ఎంతటివారినైనా శిక్ష అమలు చేస్తామని భూములు కాపాడాలని అధికారులు సూచించిన పట్టించుకోవడంలేదని అన్నారు కావున వెంటనే ప్రభుత్వ రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఆ భూములను కాపాడాలని కోరారు లేనియెడల తదుపరి జరిగే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న విశ్వనాథన్ సిపిఎం జిల్లా నాయకులు తిరుపతి నాయక్ సిపిఎం వెల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్ ,మాజీ కౌన్సిలర్ సో గ్రఫీ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు తదితరులు పాల్గొన్నారు.