టీ.టీ.డీ మెంబర్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు ఘన సన్మానం

Published: Wednesday September 29, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 28, (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) పాలకమండలి సభ్యుడిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన సోమిడి మహింద్రన్ హై కోర్ట్ అడ్వకేట్ (శ్రీ సాయి న్యూ లైఫ్ హాస్పిటల్) కోరుట్ల వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోమిడి విష్ణువర్ధన్ (టి.ఆర్.ఎస్.వై), తుమ్ నారాయణ, జంగిపల్లి మణిందర్, తదితరులు పాల్గొన్నారు.