సిఐటియు పోరాట పలితమే అంగన్వాడీల వేతనాల పెంపు.

Published: Friday August 20, 2021
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి త్రివేణి
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 19 (ప్రజాపాలన) : సిఐటియు పోరాటం పలితంగానే అంగన్వాడీలకు వేతనాల పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి త్రివేణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ పెంచిన వేతనాల ఏరియర్స్ సకాలంలో వెంటనే చెల్లించాలని, ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కారం చేసే దిశలో ఆలోచించాలని అన్నారు. 2018 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం జీతాలు టీచర్స్కు 1500, ఆయాలకు 750, మినీ టీచర్స్ కు 1250, అవి కూడా కలిపి ఇచ్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కర్తవ్య నిర్వహణలో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కాలం నుండి టిఏ, డిఏ లు లేవని, జిల్లా వ్యాప్తంగా 2016 నుండి టి ఏ, డి ఏ లు ఇవ్వడం లేదని, సెంటర్ మెయింటినెన్స్ చార్జీలు, ఇవ్వడం లేదని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పెన్షన్ సౌకర్యం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగాకనీస వేతనం 21 వేలు ఇవ్వాలని, దానితో బాటు అంగన్వాడీలు మరిన్ని సమరశీల పోరాటాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఉమాదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు వనిత, ధనలక్ష్మి, అంజలి రాథోడ్, సువర్ణ, మంజుల, సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్, ముంజం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.