కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ నరసింహారావు వర్ధంతి వేడుకలు*

Published: Saturday December 24, 2022
మధిర రూరల్ డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ  ప్రధాని *పివి నరసింహారావు* వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్ పట్టణకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వాారుమాట్లాడుతూబహుభాషా పండితుడు, ఆర్థిక మేధావి. రాజకీయాల్లో  గల్లీ నుంచి ఢిల్లీ పీఠానికి ఎదిగిన రాజకీయ మహనీయుడు పీవీ నరసింహారావు  దేశంలోనే అత్యున్నత రాజకీయ ప్రధాని పదవిని అధిరోహించి పూర్తి కాలం సేవలు అందించి ప్రత్యేక ఘనత సాధించారు.
గాంధీ కుటుంబేతర ప్రధానిగా..
స్వతంత్ర భారత చరిత్రలో పీవీ లాంటి వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న మనిషి చాలా అరుదు. గాంధీ కుటుంబం తర్వాత ప్రధాని పోస్టులో పూర్తి కాలం పదవి నిర్వహించిన వ్యక్తి ఆయన మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా, సంస్కరణలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన వ్యక్తిగా పీవీకి ఎంతో గుర్తింపు ఉంది.ఆరుసార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ప్రధాని పదవులు చేపట్టారు అన్నారు, ఆయన ప్రధానమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే’నని చెప్పుకున్నారు. సరళీకరణ విధానాల ప్రకటనతో  పీవీ గ్రాఫ్ జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతోగానో పెరిగిపోయింది. ఆర్థిక, సరళీకరణ విధానాల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగారు. ఈ రోజు దేశంలో ప్రైవేటు, పారిశ్రామిక రంగం పెరగడానికి ఆ మహనీయుడు వేసిన బాటలే కారణం అన్నారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* ,మున్సిపాలిటీ కౌన్సిలర్ *మునుగోటి వెంకటేశ్వరరావు* , మాజీ సర్పంచ్ *బొమ్మకంటి హరిబాబు* ,సోషల్ మీడియా నియోజకవర్గ కో ఆర్డినేటర్ షైక్ *జహంగీర్* ,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా* ,కాంగ్రెస్  నాయకులు సొసైటీ డైరెక్టర్ *పతై పరపు సంగయ్య*  పట్టణ కాంగ్రెస్ నాయకులు *అది మూలం శ్రీనివాసరావు, బండారి నరసింహారావు, మోదుగు బాబు, రమణ నాయక్ రామారావు, మైలవరపు చక్రి, నూర్ మొహమ్మద్* మొదలవారు పాల్గొన్నారు...