ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ప్రాచీన యోగా పద్ధతులు, ఆరోగ్య లాభాలను ప్రపంచానికి చాటిచెప్పిన మన ప్రధానికి దక్కుతుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బిజెపి నేతలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ హాజరై ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... మానసిక, శారీరక ఉల్లాసానికి యోగా దివ్య ఔషధంని చెప్పారు. భారతీయ సంస్కృతి వల్లే కరోనా కట్టడి చేయడానికి అవసరమైన చర్యలు భౌతిక దూరం, మాస్క్  ఇప్పుడు మనం పాటిస్తూ, జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కోట్లాది మంది భారతీయులు సమర్థంగా ఎదుర్కొన్నారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. ప్రాచీన యోగా పద్దతులు, ఆరోగ్య లాభాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకి దక్కుతుందన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రకృతిసిద్దంగా దొరికే ఆక్సిజన్ ను కొనాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజం, దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే రోగాలు మన దరి చేరవని చెప్పారు. ఈ యోగా దినోత్సవంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు నిమ్మల సునీతాశ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేనా, ఏనుగు రాంరెడ్డి, పాల్వయి లక్ష్మణ్, మంత్రి మహేష్, జగన్ ముదిరాజ్, అకంగారి రవి గౌడ్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు శ్రీధర్ గౌడ్, మురళీ, సుధాకర్, అక్షయ్, భాను, రామాచారి సహా పలువురు పాల్గొన్నారు.