సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్

Published: Tuesday November 15, 2022
మేడిపల్లి, నవంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) 
హబ్సిగూడ డివిజన్ రోడ్డు నెంబర్ 1లో ప్రారంభించిన సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ నెలకొన్న ఎలక్ట్రిసిటీ సమస్యలు మరియు రవీంద్ర నగర్ కాలనీలో ఉన్న  డ్రైన్ వాటర్ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు.
 ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ 
డిఈ నాగమణి, ఏఈ సాయి కిరణ్, జలమండలి ఏఈ ఆసిఫ్ అలీ, ఎలక్ట్రిసిటీ ఏఈ రామ్ రెడ్డి, హబ్సిగూడ డివిజన్ సీనియర్ నాయకులు సంజయ్ పటేల్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.