సండ్రవి వెన్నుపోటు రాజకీయాలు.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్..

Published: Wednesday April 05, 2023

తల్లాడ, ఏప్రిల్ 4 (ప్రజాపాలన న్యూస్):  పేదలందరికీ రెండు పడకల ఇళ్ళు నిర్మించకుండా,పేదల ఇళ్ళ నిర్మాణానికి 3లక్షలు మంజూరు చేయకుండా,ఇంతవరకు సత్తుపల్లిలో పేదలకి గజం జాగా పంచకుండా,రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా,నిరుద్యోగ భృతి ఇవ్వకుండా,ప్రశ్నాపత్రాల లీకేజ్ తో ఉద్యోగాలు అమ్ముకుంటూ లీకేజి లతో 10వ తరగతి విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తూ,పోడు రైతులకి పట్టాలు ఇవ్వకుండా ముస్లింలకి,గిరిజనులకి 12శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా,ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేస్తున్న సమ్మేళనాలను ఆత్మీయ సమ్మేళనాలు అనటం కన్న ప్రజా వెన్నుపోటు సమ్మేళనాలు అనటం సబబు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం మానవతారాయ్ హాథ్ సే హథ్ జోడో అభియాన్ యాత్రను కుర్నవల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శీలం సిధ్ధారెడ్డి ఆధ్వర్యంలో తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం బూత్ నెంబర్ 52,53,54'55లలో నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతారాయ్ గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ని ఈసారి గెలిపించాలని ప్రజలను కోరారు. సత్తుపల్లి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మించి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు  కల్పిస్తామని మానవతారాయ్ గడపగడపకు ప్రచారం చేసుకుంటూ పర్యటించారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రవి, నాగేశ్వరరావు,అయిలూరి వెంకటేశ్వరరెడ్డి,కుర్నవల్లి మాజీ సర్పంచ్ గంటల వెంకటాచారి,దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డి,కుర్నవల్లి కాంగ్రెస్ నాయకులు గుర్రాల లక్ష్మారెడ్డి,గోపాల కృష్ణారెడ్డి,వెన్నపూస చిన్న వెంకటరెడ్డి,వేమిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు.