మహిళాల రక్షణకు పేపర్స్ స్ప్రే దోహదం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday February 19, 2021
మేడిపల్లి, ఫిబ్రవరి18 (ప్రజాపాలన): దొంగలు, పోకిరిల నుండి తనను తాను రక్షించుకోవడానికి మహిళలకు, విద్యార్థినులకు పేపర్స్ స్ప్రే ఎంతగానో ఉపయోగపడుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. హబ్సిగూడ మెయిన్ రోడ్ లోని హరిప్రియ కాంప్లెక్స్ రెండవ అంతస్తులో "కాంబాట్ పేపర్స్ స్ప్రే" నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంబాట్ పేపర్స్ స్ప్రే ప్రొప్రైటర్ సత్యనారాయణ, అలీమ్ మాట్లాడుతూ ఒంటరిి మహిళలకు, విద్యార్థినులకు, అవుుట్ కట్స్లో నివాసం ఉంటున్న వృద్ధులు తమను తాను రక్షించుకోవడానికి ఈ పేపర్స స్ప్రే చాలా ఉపయోగపడుతుందని వారు తెలిపారు. వచ్చే మహిళా దినోత్సవం రోజున ఈ పేపర్స్ స్ప్రేేను మార్కెట్ లోనికి అందరికీ అందుబాటులో ఉండే ధరను నిర్ణయించి విడుదల చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం  శ్రీనివాస్,  స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.