నూరుశాతం కరోనా టీకాలు పూర్తికావాలి, ప్రజలు అందరూ సహకరించాలి : ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి వ

Published: Wednesday December 08, 2021
మధిర డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలపరిదిలో గల పిహెచ్సి మాటూరుపేట పిహెచ్సి దెందుకూరు మరియు మధిర ప్రాంతంలో 18+ మరియు సీనియర్ సిటిజన్ లు కరోనా వాక్సిన్ అర్హత గల ప్రజలు మీ ఇంటి ముందుకు  మీ వద్దకు పారా మెడికల్ మరియు జిపి సిబ్బంది వస్తున్నారు. కనుక దయ చేసి సహకరింంచి 2nd డోస్ మరియు ఇంకా అపోహలు ఉండి మొదటి డోస్ వేయించుకోని వారు తప్పకుండ వేయించు కోవాలని మధిర మండలం ఎంపీడీఓ పిహెచ్సి వైద్య అధికారులు ప్రజలను సహృదయంతో వేడుకొంటున్నాం అని వారు పత్రిక ముఖముగా తెలియజేస్తూన్నారు. జిల్లా అధికారులు ఆదేశాలు మేరకు ఈ నెలఖరు లోపు నూరు శాతం కరోనా వాక్సిన్ కార్యక్రమం పూర్తి చేసి మధిర మండలం బెస్ట్ మండలంగా పేరు తెచ్చు కోవాలని ఇందుకు అందరూ సహకరించలని కోరుతున్నారుగ్రామాల్లో టీమ్ ల వారీగా ప్రత్యేక డ్రైవ్ మొదలు పెట్టి ఉదయం సాయంత్రం టీకా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జిపి సిబ్బంది రెవిన్యూ సిబ్బంది icds ikp సిబ్బంది పాల్గొంటున్నట్లు వారు తెలియచేసినారు.