మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday December 29, 2021
మధిర డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాను మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏ వర్గానికి మేలు చేయలేదని రైతు పక్షాన గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ నిరుద్యోగ సమస్య రైతు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్రాలు విఫలమయ్యాయని దాని విషయంలో గాని ప్రభుత్వం తరఫున 2018 నుంచి రుణమాఫీ ఇంతవరకు జరగలేదని ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారుగాని అని ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు కౌన్సిలర్ కోనా ధని కుమార్ మధిర పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వరమా కిరణ్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు జహంగీర్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు బిట్రా ఉదండయ్య మాజీ సర్పంచులు కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు బోడేపూడి గోపి ఎడ్లపల్లి వెంకటకృష్ణ మాగం ప్రసాద్ ఆదిమూలం శ్రీను కోట డేవిడ్ రహీం తదితరులు పాల్గొన్నారు